తెలంగాణ

telangana

ఆయన​ గెలిస్తే నా సమస్యలు బయటపెడతా: పూనమ్‌

By

Published : Oct 2, 2021, 7:44 AM IST

Updated : Oct 2, 2021, 10:00 AM IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో(Maa elections 2021) ప్రకాశ్‌రాజ్ గెలవాలని ఆశించారు నటి పూనమ్​ కౌర్​. అప్పుడే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉందని చెప్పారు.

poonam kaur
పూనమ్​ కౌర్​

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్(maa elections prakash raj panel) గెలవాలని తాను కోరుకుంటున్నట్టు నటి పూనమ్‌ కౌర్‌ తెలిపారు(Poonam kaur movies). అప్పుడే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి దిగిన ఫొటోని పంచుకుంటూ ఓ ట్వీట్‌ పెట్టారు. " 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌(Maa elections 2021) సర్‌ గెలవాలని కోరుకుంటున్నా. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు' అని పేర్కొన్నారు.

ప్రకాశ్‌రాజ్‌ 'మా' ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్టోబరు 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. 'శౌర్యం', 'గణేష్‌', 'గగనం', 'శ్రీనివాస కల్యాణం' సహా పలు చిత్రాల్లో పూనమ్‌ కౌర్‌ నటించి మెప్పించారు. ప్రకాశ్‌రాజ్‌-పూనమ్‌ కలిసి 'గగనం' చిత్రంలో నటించారు.

ఇదీ చూడండి: 'నాతో ఆ దర్శకుడు దారుణంగా మాట్లాడాడు'

Last Updated :Oct 2, 2021, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details