పిల్లలు చెడుగా ప్రవర్తించినా, నేరాలకు పాల్పడినా తల్లిదండ్రులను శిక్షించేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తోంది చైనా(china news law). 'ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లా' పేరుతో దీన్ని తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది. త్వరలోనే దీనిపై పార్లమెంటులో ఓటింగ్ జరగనుంది(china latest news).
ఈ చట్టం ప్రకారం(china children law) పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, ఏమైనా నేరాలకు పాల్పడినా తల్లిడంద్రులకు సమాచారమిచ్చి ఫ్యామిలీ ఎడ్యుకేషన్ మార్గదర్శకాలను వివరిస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల తప్పులను సరిదిద్దకపోతే(china Family Education Law) వారు పనిచేసే యజామానులకు ఆ విషయాన్ని తెలియజేస్తారు. అనంతరం శిక్షణ ఇప్పిస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు ట్రైనింగ్‌కు హాజరు కాకపోతే 156 డాలర్ల(రూ.11,600) జరిమానా విధిస్తారు. ఐదు రోజుల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకపోవడానికి చాలా కారాణాలున్నాయని, తల్లిదండ్రులు వారి పట్ల శ్రద్ధ వహించకపోవడమూ ప్రధాన కారణమని చైనా చట్టసభ వ్యవహారాల కమిషన్ అధికార ప్రతినిధి జాంగ్ తైవే తెలిపారు. కమ్యూనిస్టు పార్టీని, దేశాన్ని, ప్రజలను, సామ్యవాదాన్ని ప్రేమించేలా పిల్లలకు బోధించడం తల్లిదండ్రుల బాధ్యతని కొత్త చట్టం చెబుతోందన్నారు.