తెలంగాణ

telangana

గిడ్డంగిలో అగ్నిప్రమాదం- 14 మంది మృతి

By

Published : Jul 24, 2021, 7:26 PM IST

గిడ్డంగిలో అగ్నిప్రమాదం సంభవించి 14మంది మృతిచెందారు. 26మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

warehouse,
అగ్నిప్రమాదం, గిడ్డంగి

ఈశాన్య చైనా జిలిన్ ప్రాంతంలోని ఓ గిడ్డంగిలో అగ్నిప్రమాదం సంభవంచి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. జింగ్​యే హైటెక్​ ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ జోన్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో 26మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. 12 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి కారణమేంటనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:చైనాలో వరద బీభత్సం- 10 బిలియన్​ డాలర్ల నష్టం

ABOUT THE AUTHOR

...view details