తెలంగాణ

telangana

ETV Bharat / international

రక్త క్యాన్సర్​కు కొత్త మందులు

రక్త క్యాన్సర్​ చికిత్సకు కొత్త ఔషధాలను కనిపెట్టారు అమెరికాలోని క్లీవ్​ల్యాండ్​ క్లినిక్​ శాస్త్రవేత్తలు. వీరిలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం.

Researchers identify potential new class of drugs to treat blood and bone marrow cancers
రక్త క్యాన్సర్​కు కొత్త మందులు

By

Published : Dec 26, 2020, 10:09 AM IST

రక్త క్యాన్సర్​ చికిత్సకు కొత్త ఔషధాలను అమెరికాలోని క్లీవ్​ల్యాండ్ క్లినిక్ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఇందులో భారత సంతతికి చెందిన బాబల్ కాంత్ ఝూ కూడా ఉన్నారు. వీరు కనుగొన్న టీఈటీఐ 76 చికిత్సా విధానం... వ్యాధి ఆరంభ దశలో క్యాన్సర్​ కణాలను లక్ష్యంగా చేసుకొని వాటిని నాశనం చేస్తుంది.

టీఈటీ2 జన్యువుల్లో మార్పులు కారణంగా రక్త క్యాన్సర్ కారక కణాలు ఏర్పడతాయి. ఈ టీఈటీ2 జన్యువులపై దాదాపు దశాబ్దం పాటు పరిశోధన అనంతరం ఈ మందును శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ప్రి క్లీనికల్ ట్రయల్స్​లో టీఈటీఐ76 విజయవంతమైందని వారు పేర్కొన్నారు. ఈ అధ్యయనాన్ని 'బ్లడ్ క్యాన్సర్​ డిస్కవరీ' తాజా సంచికలో ప్రచురించింది.

ఇదీ చదవండి:ఇజ్రాయెల్​పై గాజా రాకెట్​ దాడులు

ABOUT THE AUTHOR

...view details