తెలంగాణ

telangana

ETV Bharat / international

'బోజ్కిర్​పై భారత్​ వ్యాఖ్యలు విచారకరం'

యూఎన్​ జనరల్​ అసెంబ్లీ అధ్యక్షుడు బోజ్కిర్​పై భారత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రతినిధి తప్పుపట్టారు. భారత్​ వైఖరి సరికాదని పేర్కొన్నారు.

un general assembly president, ఐక్యరాజ్య జనరల్​ అసెంబ్లీ
భారత్​కు ఐక్యరాజ్య జనరల్ అసెంబ్లీ ప్రతినిధి కౌంటర్

By

Published : Jun 2, 2021, 9:30 AM IST

ఐక్యరాజ్య సమితి​ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కన్​ బోజ్కిర్​పై భారత్​ చేసిన వ్యాఖ్యలు విచారకరమని ఆయన ప్రతినిధి​ అమీ క్వాంట్రిల్​​ అన్నారు. భారత్​-పాక్​ మధ్య శాంతి కోసం అధ్యక్షుడు కృషి చేస్తుంటే ఈ వైఖరి సరికాదని ఆమె అన్నారు. యూఎన్​ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

పాక్​ విదేశాంగ మంత్రితో భేటీ సందర్భంగా వోల్కన్​ బోజ్కిర్.. భారత్​, పాక్​ల మధ్య 1972లో జరిగిన సిమ్లా ఒప్పందాన్ని ప్రస్తావించారని క్వాంట్రిల్​​ తెలిపారు. దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనడం భారత్​-పాకిస్థాన్​ల దౌత్య సంబంధాలపై ఆధారపడి ఉంటుందని జోజ్కిర్​ పాకిస్థాన్​ పర్యటన సందర్భంగా పేర్కొన్నారని ఆమె అన్నారు. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేందుకు అధ్యక్షుడు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తారని స్పష్టం చేశారు.

భారత్​ వ్యాఖ్యలు

ఇటీవల యూఎన్​ అధ్యక్షుడు.. పాకిస్థాన్​ పర్యటన సందర్భంగా కశ్మీర్​ అంశాన్ని ప్రస్తావించారు. బోజ్కిర్​ వ్యాఖ్యలను భారత్​ ఖండించింది. ఆయన వ్యాఖ్యలు తప్పుదోవపట్టించే విధంగా, పక్షపాతంగా ఉన్నాయని.. తన హోదాకు బోజ్కిర్​ అపకారం చేశారని మండిపడింది.

ఇదీ చదవండి :గాజా వివాదంపై ఓటింగ్​కు భారత్​ దూరం

ABOUT THE AUTHOR

...view details