UNSC Vote on Russia:ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకున్న నేపథ్యంలో అమెరికా తదితర దేశాల కూటమి ప్రత్యామ్నాయ చర్యలు ముమ్మరం చేసింది. ఇదే అంశంపై చర్చించేందుకు 199 సభ్య దేశాలున్న ఐరాస సర్వప్రతినిధి సభ అసాధారణ, అత్యవసర ప్రత్యేక సమావేశానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు 15 సభ్య దేశాల భద్రతా మండలి ఓటింగ్‌లో పాల్గొన్నాయి.
ఈ తీర్మానానికి అనుకూలంగా 11 ఓట్లతో ఆమోదం లభించింది. దీంతో సోమవారం సర్వసభ్య సమావేశం జరగనుంది. అయితే ఉక్రెయిన్‌పై జనరల్ అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చేందుకు భారత్, చైనా, యూఏఈలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. 1950 తర్వాత సాధారణ అసెంబ్లీలో ఇది 11వ అత్యవసర సమావేశం మాత్రమే.