Suriya Bala movie Budget problem: విభిన్న సినిమాల దర్శకుడు బాలాతో కథానాయకుడు సూర్య ఓ సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్ కూడా ఇటీవలే పూర్తైంది. అయితే ఇప్పుడీ సినిమా షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలిసింది. బడ్జెట్ సమస్యలు ఎదురైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నారట. దీంతో బడ్జెట్ పెరిగే అవకాశాలు ఉన్న కారణంగా తాత్కాలికంగా చిత్రీకరణను నిలిపివేసి.. ఈ విషయమై చర్చలు జరుపుతున్నారట. మరి సినిమాను ఓ భాగానికే కుదించాలా లేదా బడ్జెట్ లెక్కల్ని అంచనా వేసి రెండు భాగాలుగా రూపొందించాలా అనేది ఆలోచిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అయింది. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. కాగా, ఈ మూవీలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఓ పాత్రలో మత్స్యకారుడిగా కనిపిస్తారని అంతా మాట్లాడుకున్నారు. 19 ఏళ్ల తర్వాత బాలా, సూర్య కలయికలో వస్తున్న మూడో చిత్రం కావడం వల్ల దీనిపై భారీ అంచనాలున్నాయి. జి.వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
సూర్య-బాలా మూవీ నిలిపివేత.. మలేషియాకు చిరు మూవీటీమ్!
Suriya Bala movie Budget problem: మరికొన్ని సినిమా కబుర్లు వచ్చాయి. సూర్య-బాల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్కు బడ్జెట్ సమ్యస తలెత్తినట్లు తెలిసింది. దీంతో తాత్కాలికంగా చిత్రీకరణను నిలిపివేశారట! చిరంజీవి 'వాల్తేర్ వీరయ్య' మూవీటీమ్ షూటింగ్ కోసం మలేషియా వెళ్లనున్నట్లు సమాచారం.
Chiranjeevi movie team Malaysia: బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'వాల్తేర్ వీరయ్య' సినిమా తెరకెక్కుతోంది. మాస్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుల నాయకుడిగా కనిపించనున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం విదేశాల్లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు మూవీటీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం చిత్రబృందం మలేషియాకు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఇదీ చూడండి:'సీతారామం' రిలీజ్ డేట్.. 'ఎఫ్ 3' మేకింగ్ వీడియో.. 'డాన్' 100కోట్లు