బింబిసార సినిమాతో సక్సెస్ అందుకున్న నందమూరి కల్యాణ్ రామ్ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు మించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్టయ్యారు. అంతే కాకుండా ఈ సినిమాతో టాలీవుడ్లో కల్యాణ్ రామ్ క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఈ సినిమా మరింత ఎక్కువ సేపు ఉంటే బాగుంటుంది అని ఫీలైన ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. అలా ఫీలవుతున్న అభిమానుల కోసం ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నట్లు కల్యాణ్ రామ్ చెప్పారు. కానీ ఎప్పుడు వస్తుందనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు.
ఫ్యాన్స్‌కు కల్యాణ్ రామ్ గుడ్ న్యూస్.. బింబిసార సీక్వెల్ ఎప్పుడంటే?
టైం ట్రావెల్ డ్రామాగా తెరెకెక్కిన రీసెంట్ హిట్ మూవీ బింబిసార. కల్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతే కాకుండా అంచనాలకు మించి బాక్సాఫీస్ వసూళ్లను కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్న అభిమానుల కోసం గుడ్ న్యూస్ షేర్ చేశారు కల్యాణ్ రామ్. అదేంటంటే..
ప్రస్తుతం అమిగోస్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన కల్యాణ్ రామ్ తన తదుపరి ప్రాజెక్ట్ డెవిల్ షూటింగ్లో నిమగ్నమయ్యారు. దీంతో ఇక బింబిసార వచ్చే ఏడాది సెట్స్‌పైకి వస్తుందని ఫ్యాన్స్ అందరూ ఫిక్సైపోయారు. ఇక అంత వరకు వెయిట్ చేయాలంటూ నిరాశ చెందుతున్న సమయంలో కల్యాణ్ రామ్ ఓ గుడ్ న్యూస్ తెలియజేశారు. అదేంటంటే డెవిల్ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయిందని.. ఇక వశిష్ఠతో కలిసి ఈ ఏడాది చివరి కల్లా బింబిసారను సెట్స్‌పైకి ఎక్కించే పనుల్లో ఉంటామంటూ తెలిపారని సినీ వర్గాల సమాచారం.
ఈ అప్డేట్ విన్న ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఇక తప్పకుండా సీక్వెల్‌ను చూడొచ్చు అంటూ తమ సంతోషాన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం కల్యాణ్ రామ్ 'అమిగోస్' సినిమాతో మూడు విభిన్న పాత్రల్లో నటించారు. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.