తెలంగాణ

telangana

పవన్​కల్యాణ్​కు ఉన్న ఏకైక ఆస్తి అదొక్కటేనట.. అన్నీ అప్పులే!

By

Published : Jan 31, 2023, 2:58 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్​కు ఉన్న ఆస్తుల, అప్పులు గురించి తెలిపారు మెగా బ్రదర్​ నాగబాబు. వాటి గురించి వివరించారు. ఆ సంగతులు.

Pawan Nagababu
పవన్​కల్యాణ్​కు ఉన్న ఏకైక ఆస్తి అదొక్కటేనట.. అన్నీ అప్పులే!

ఆ పేరు వింటే అభిమానులు ఆనందంతో ఉర్రూతలూగిపోతారు. ఆయన కనిపిస్తే చాలు థియేటర్‌ దద్దరిల్లిపోయేలా గోల చేస్తారు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఏ హీరోకు లేని రేంజ్​లో అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ పేరే పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్‌. డైలాగ్స్‌తోనే కాదు, పాటలు, ఫైట్లతో అభిమానులను చొక్కా ఎగరేసుకునేలా చేశారాయన. మెగా కుటుంబం నుంచి వచ్చినా, తనకంటూ ఓ స్పెషల్​ ఇమేజ్​ను క్రియేట్​ చేసుకున్నారు. ఇంతటి ప్రేమాభిమానాలు దక్కించుకోవడంలో ఆయన వ్యక్తిత్వానిది ముఖ్యపాత్రే. ప్రస్తుతం ఆయన ఓ వైపు రాజకీయాలు మరోపైవు సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. అలానే ఎంతో మందికి సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. అయితే చాలా సార్లు ఆయన ఆస్తులు కన్నా అప్పులే ఎక్కువ అంటూ పలు సందర్భాల్లో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడా విషయాల్ని వివరించారు మెగా బ్రదర్​ నాగబాబు. ఆయనకున్న ఆస్తి ఏంటనేది తెలిపారు.

"కల్యాణ్​కు ఆస్తుల కన్నా కూడా అప్పులే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ రెమ్యునరేషన్​ తీసుకునే పవన్​కు అప్పులు ఉన్నాయంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. పార్టీ కోసం, ప్రజల కోసం తన సంపాదన నుంచే హెల్ప్​ చేస్తుంటాడు. జనసేన స్థాపించిన సమయంలో పిల్లల పేరిట ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్లు తీశాడంటూ వచ్చిన వార్తలు కూడా నిజమే. తన ఆస్తులు మొత్తం తాకట్టులోనే ఉన్నాయి. తనకంటూ ఉన్న ఆస్తులు ఏమీ లేవు. ఒక్క ఫామ్ హౌస్ మాత్రమే ఉంది. అతడికి ఒకే ఒక్క ఆస్తి. 8 ఎకరాల పొలం మాత్రమే. ఎంతో ఇష్టంతో కొనుకున్నాడు. జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు తాను తీసుకున్న రూ.కోటిన్నర రెమ్యూనరేషన్​ను డిస్టిబ్యూటర్స్​కు వెనక్కి ఇచ్చేశాడు. ఇంకా తన సేవింగ్స్ కూడా కొన్ని వాళ్లకే ఇచ్చాడు. అయితే ఆ 8 ఎకరాల పొలం కూడా ఇచ్చేస్తానని చెప్పాడు. అప్పుడు దాని విలువ రూ.15 లక్షల వరకు ఉంది. నేను అడ్డుపడి బలవంతంగా ఆపాను. తనకున్న ఇల్లు, కార్లు కూడా లోన్​లోనే ఉన్నాయి. ఆస్తులు కూడబెట్టాలని అన్న మనస్థత్వం లేదు" అంటూ మెగా బ్రదర్ నాగబాబు పేర్కొన్నారు.

ప్రస్తుతం పవన్​ కల్యాణ్​ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. వాటిలో క్రిష్ ధర్శకత్వంలో హరిహరవీరమల్లు ఒకటి. ఇందులో పవన్ గజదొంగగా కనిపించనున్నారు. ఇంకోటి యంగ్​ మెగా హీరో సాయితేజ్​తో కలిసి వినోదయ సిత్తం రీమేక్ చేస్తున్నారు. సాహో డైరెక్టర్​ సుజీత్​తో కలిసి భారీ యాక్షన్​ ఎంటర్​టైనర్​ OG, హరీశ్​ శంకర్​తో ఉస్తాద్​ భగత్​ సింగ్​లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి:గ్రాండ్​గా నాని-మృణాల్​ ఠాకూర్​ కొత్త సినిమా షురూ.. చీఫ్​ గెస్ట్​గా చిరు

ABOUT THE AUTHOR

...view details