తెలంగాణ

telangana

బాలయ్య 'వీరసింహా'.. చిరంజీవి 'వాల్తేరు'.. కలెక్షన్స్​లో ఎవరు దూసుకెళ్తున్నారంటే?

By

Published : Jan 16, 2023, 2:11 PM IST

బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తున్నాయి. అయితే ఈ చిత్రాలు ఇప్పటివరకు ఎంత వసూలు చేశాయంటే?

Veerasimha collections
బాలయ్య 'వీరసింహా'.. చిరంజీవి 'వాల్తేరు'.. కలెక్షన్స్​లో ఎవరు జోష్​ మీదున్నారంటే?

'అఖండ' తర్వాత అదే రేంజ్​లో ఫుల్​జోష్​తో వచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సినిమా 'వీరసింహా రెడ్డి'. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా సూపర్​ హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. తొలి రోజు నుంచే మంచి వసూళ్లను అందుకుంటూ బాక్సాఫీస్​ వద్ద అదరగొడుతోంది. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో వరల్డ్​ వైడ్​గా రూ.104కోట్ల గ్రాస్​ వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ మూవీతో పాటే జనవరి 13న రిలీజైన చిరంజీవి-రవితేజ 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్​ పరంగా బాక్సాఫీస్​ వద్ద మరింత వేగంగా దూసుకెళ్తోంది. ఇది మూడు రోజుల్లోనే ప్రంపచవ్యాప్తంగా రూ.108 కోట్లను సాధించింది.

కాగా, వీరసింహారెడ్డిలో బాల‌కృష్ణ యాక్టింగ్‌, యాక్ష‌న్ సీక్వెన్స్ అభిమానుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. బాలయ్య సరసన శృతిహాస‌న్‌, మలయాళీ భామ హ‌నీ రోజ్ హీరోయిన్లుగా న‌టించారు. బాల‌కృష్ణ సోద‌రిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ న‌టించింది. దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టించారు. తమన్ సంగీతం అందించారు.

ఇక వాల్తేరు విషయానికొస్తే.. చిరంజీవి-రవితేజ అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యాక్షన్, డ్యాన్స్​లు సహా బ్రదర్ సెంటిమెంట్ ఎలిమెంట్స్‌ ఆడియెన్స్‌ను ఊర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా చిరు, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్‌ను విపరీతంగా అలరిస్తున్నాయి. మొత్తంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ సినిమా వీపరీతంగా అలరిస్తోంది. ప్రకాష్ రాజ్, బాబీ సింహ కీలక పాత్రల్లో నటించారు. శ్రుతి హాసన్, కేథరిన్​ హీరోయిన్స్​గా కనిపించారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌తో సాగే సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఇదీ చూడండి:Waltair veerayya: వంద కోట్ల క్లబ్​లో 'వాల్తేరు వీరయ్య'.. మూడు రోజుల్లో ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details