తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిటి చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థలలో గీతాఆర్ట్స్ ఒకటి. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు కొత్తదనం నిండిన బలమైన కంటెంట్‌తో ఉంటాయనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అయితే అల్లు ఫ్యామిలీలో గీతా అనే పేరు గల వ్యక్తి ఎవరు కనిపించలేదు. కానీ నిర్మాణ సంస్థకు మాత్రం గీత అనే పేరు ఎందుకు పెట్టారు? అసలు ఎవరా గీత? అనే సందేహాం చాలా మందికి ఉండేది. తాజాగా ఎట్టకేలకు గీత పేరు వెనక ఉన్న అసలు కథ చెప్పేశారు నిర్మాత అల్లు అరవింద్. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసిన ఆయన.. గీతా ఆర్ట్స్‌లో 'గీత' ఎవరు? ఆ పేరు వెనక ఏదైనా కథ ఉందా? అని అలీ అడిగన ప్రశ్నకు సమాధానం చెప్పారు.
"గీతా ఆర్ట్స్ అనే పేరు పెట్టింది మా నాన్న. భగవద్గీత సారాంశం నచ్చి ఆ పేరు పెట్టారు. 'ప్రయత్నం మాత్రమే మనది. ఫలితం మన చేతిలో ఉండదు' ఇది సినిమాలకు బాగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యడమే కానీ, ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అని గీతా పేరు పెట్టారు. (మధ్యలో ఆలీ అందుకుని.. పెళ్లయిన తర్వాత నిర్మలా ఆర్ట్స్ అని పెట్టవచ్చు కదా అని అడిగారు) గీత పేరు మీద తీసిన సినిమాలన్నీ సిల్వర్‌జూబ్లీ ఆడాయి. అందుకే మార్చాలన్న ఆలోచన మాకు రాలేదు. ఇంకొక విషయం ఏమిటంటే నేను చదువుకునే రోజుల్లో నాకు 'గీత' అనే గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. నా స్నేహితులు కూడా ఆ పేరుతో ఆటపట్టించేవారు (నవ్వులు)" అని పేర్కొన్నారు.