రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో రోడ్డు ప్రమాదం జరిగింది. నాలుగు లైన్ల వంతెనపై ఓ లారీని.. డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడం వల్ల ఇద్దరు మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
వ్యానులో చిక్కుకున్న వారిని స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పశ్చిమ బంగాకు చెందిన బోసన్, తారిఫ్ మృతిచెందారు.