తెలంగాణ

telangana

Car fell into well in Siddipet: బావిలో పడిన కారు.. నీటిలోనే తల్లి, కుమారుడు!

By

Published : Dec 1, 2021, 4:16 PM IST

Updated : Dec 1, 2021, 6:25 PM IST

Car fell into well in Siddipet : సిద్దిపేట జిల్లా చిట్టాపూర్​లో ఘోరప్రమాదం జరిగింది. రహదారి పక్కన ఉన్న ఓ బావిలో కారు అదుపుతప్పి పడిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కారును వెలికితీసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కారులో తల్లి, కుమారుడు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Car fell into well in chittapur
బావిలోకి దూసుకెళ్లిన కారు

Car fell into well in Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ వద్ద విషాదం నెలకొంది. రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కన చిట్టాపూర్ భూంపల్లి గ్రామాల మధ్యలో రోడ్డు పక్కన ఉన్న బావిలో అదుపు తప్పి కారు పడింది. కారులో తల్లి, కుమారుడు ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. బాధితులు సిద్దిపేట జిల్లా నందిగామ వాసులుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బావి లోతు సుమారు ఇరవై గజాలు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది... బావిలోనుంచి కారును వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మోటార్ల సాయంతో బావిలోని నీటిని ఖాళీ చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు... సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.

బావిలో పడిన కారు.. నీటిలోనే తల్లి, కుమారుడు!

'ఓ పనిమీద చిట్టాపూర్ పోయిన. తిరిగి మా సొంతూరు ఎనుగుర్తికి వస్తున్నా. మెయిన్ రోడ్డులోనే బ్రిడ్జి దగ్గర రైట్ సైడ్ ఓ బావి ఉంది. అటునుంచి సిద్దిపేట వైపునకు తెల్లకారు వేగంగా వచ్చింది. వేగంగా వచ్చి బావిలో పడిపోయింది. నేను బ్రిడ్జి నుంచి దిగి చూసేవరకు బావిలో మునిగిపోయింది. బావి చుట్టూ కంప, కంచె ఉంది. జేసీబీ సాయంతో అంతా తొలగించారు.'

-మల్లేశం, ప్రత్యక్ష సాక్షి

ఇదీ చదవండి:TS Cabinet sub committee meeting: కొవిడ్ పరిస్థితులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

Last Updated :Dec 1, 2021, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details