students photo morphing case accused arrested: అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ విద్యార్థినులను వేధిస్తున్న సైబర్ నేరగాళ్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌తో పాటు మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురు విజయవాడకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.
రెండు నెలలుగా 8 ఫోన్ నెంబర్ల నుంచి అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు వాపోయారు. ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం హ్యాక్ చేస్తున్నట్లు కళాశాల వసతి గృహం హెర్డెన్‌కు చెప్పడంతో.. ఆమె ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పట్టుకోవాలని కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు కొన్ని రోజుల నుంచి ఆందోళన చేపట్టాయి. ఆందోళన దృష్ట్యా సంక్రాంతి సెలవులను ముందుగానే యాజమాన్యం ప్రకటించింది.