- రేపే పట్టభద్రుల పోలింగ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు.. ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలతో ప్రచారం ముగిసింది. ఇవాళ ఉదయం నుంచి ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేయనున్నారు. అన్ని ప్రముఖ పార్టీలు.. స్వతంత్ర్య అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆమె సేవలు ప్రశంసనీయం
సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ ఇందు మల్హోత్రా శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆవరణలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే.. న్యాయ వ్యవస్థకు జస్టిస్ మల్హోత్ర చేసిన సేవలను కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అసోంలో రూ.31 కోట్ల నగదు
అసోంలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి మొత్తం రూ.31.81 కోట్లకు పైగా విలువైన నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులు పట్టుకున్నామని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. నగదు, మద్యం, బంగారం, వెండి ఆభరణాలు, నిషేధిత మత్తుపదార్థాలు సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సీఏఏ మూలకే
పౌరసత్వ సవరణ చట్టాన్ని ఒక రాజకీయాస్త్రంగా భాజపా వాడుకుంటోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్. అసోంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని అమలు కానీయబోమని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అతిపెద్ద కిడ్నీ వైద్యశాల
కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఉచిత డయాలసిస్ సౌకర్యం అందించేలా దిల్లీలో సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ అతిపెద్ద కిడ్నీ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. రోజూ 500 మందికి ఇక్కడ డయాలసిస్ సౌకర్యం కల్పించనున్నారు. 24 గంటలు రోగులకు వైద్యసేవలు అందించేలా ఈ ఆసుపత్రిని సిద్ధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆవిష్కరణల మొనగాడు!