ఈటీవీ ఆధ్వర్యంలో.. అమెరికాలో నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు.. సమాజ సేవకు నడుం కట్టారు. స్వరవేదిక పేరుతో స్వచ్చంద సేవా సంస్థను మహోన్నత ఆశయంతో ప్రారంభించారు. వెనుకబడిన పిల్లలకు, అనాథలకు ఈ వేదికతో సహాయం చేసేందుకు కృషి చేస్తున్నారు.
201 6లో 17 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ స్వరవేదిక.. అమెరికాలోని ఎన్నో నగరాల్లో సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. గత 4 సంవత్సరాల్లో 25కు పైగా కార్యక్రమాలు చేసి భారత, అమెరికా దేశాల్లో 20,000 మంది పేద విద్యార్ధులకు చేయూతనందించింది. తిత్లీ, హుద్ హుద్ తుఫాను బాధితులెందరికో ఈ స్వరవేదిక ఆసరాగా నిలిచింది.
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి అవసరమైన నిధులు సేకరించటానికి, స్వరయోకి అనే సంగీత కార్యక్రమాన్ని ఆన్లైన్, ప్రసార మాధ్యమాల ద్వారా అమెరికాలోని 10 మహానగరాల్లో నిర్వహించింది. ఇవే కాక స్వరరాగ అనే శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించి... అనేక మంది అభ్యుదయ గాయనీగాయకులకు తమ గానాన్ని ప్రదర్శించటానికి అవకాశం కల్పించి వారిని ఎంతో ప్రోత్సహించింది.
స్వరవేదిక సేవా కార్యక్రమాలు:
* అమెరికాలో ఆరోగ్య, రక్షణ సిబ్బంది కోసం 10,000 మాస్కులు కుట్టటం