Oil Prices Increase : రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంట నూనె ధరలు పెరుగుతాయని వార్తలు రావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్ పరిసరాల్లోని విజయ ఆయిల్ స్టోర్ అవుట్ లెట్ వద్ద ఉదయం నుంచి వినియోగాదురులు బారులు తీరారు. ఇతర రోజులతో పోలిస్తే గురువారం దాదాపు రెండు లక్షల రూపాయలు అదనంగా మార్కెట్ జరిగినట్టు అమ్మకం దారులు చెబుతున్నారు.
ఈ రోజు ఉదయం 8 గంటల నుంచే వినియోగదారులు ఔట్ లెట్ వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చారు. రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు చేయడంతో స్టాక్ కూడా క్రమంగా తగ్గుతోందని స్టోర్ నిర్వాహకులు వివరించారు.
విజయ ఆయిల్ అవుట్లెట్ వద్ద బారులు తీరిన వినియోగదారులు
రోజువారి ఖాతాదారులతో పాటు నిన్న భారీగా అమ్మకాలు జరిగాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంట నూనె ధరలు భారీగా పెరుగుతాయనే వార్తలు రావడంతో పెద్ద ఎత్తున వంట నూనె కొనుగోలు చేస్తున్నారు. ఉదయం నుంచే స్టోర్ వద్ద క్యూ కట్టారు. రోజువారి అమ్మకాలం కంటే నిన్న ఒక్కరోజే రూ.2లక్షలు అదనంగా అమ్మకాలు జరిగాయి. -ప్రవీణ్ , విజయ ఆయిల్ అవుట్ లెట్ ఉద్యోగి
గత నెల నుంచి ఈ నెల వరకు రూ.20పెరిగింది. అయితే ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నూనె ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. యుద్ధం ముగిసిన తర్వాత మరళా ధరలు తగ్గొచ్చు. మేము కొనుగోలు చేసేందుకు కూడా మాకు కూడా లభించడం లేదు. -సునీత, మార్కెటింగ్ డిప్యుటీ మేనేజర్ , విజయ ఆయిల్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఔట్ లెట్
ఇదీ చూడండి :రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో గ్యాస్ ధరకు రెక్కలు- వాటికి తీవ్ర కొరత!