KTR at boaston: హైదరాబాద్కు అమెరికాలోని బోస్టన్ నగరానికి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మాదిరి ఇక్కడ సైతం ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలకు చెందిన అనేక కంపెనీలు పని చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్.. బోస్టన్లో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ - 2022 ఆరోగ్య రంగంపై జరిగిన సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవకాశాలను పరిశీలించడంతో పాటు లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బోస్టన్లో హెల్త్ రికార్డుల డిజిటలీకరణ కొనసాగుతుందని తద్వారా ఇక్కడి సిటిజన్లకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని.. సదస్సులో పాల్గొన్న ఆ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్ వివరించారు. ముఖ్యంగా కరోన సంక్షోభ సమయంలో ఈ డిజిటల్ హెల్త్ రికార్డుల వలన వేగంగా వారికి చికిత్స అందించేందుకు అవకాశం కలిగిందన్నారు.