స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 958 పాయింట్లు పెరిగి మొట్ట మొదటిసారి 59,885వద్ద స్థిరపడింది. నిఫ్టీ 276 పాయింట్ల లాభంతో 17,823 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 59,957 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 59,243 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,843 పాయింట్ల గరిష్ఠ స్థాయి (కొత్త గరిష్ఠం), 17,646 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
బజాజ్ ఫిన్సర్వ్, ఎల్&టీ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ భారీగా లాభాలను నమోదు చేశాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో డాక్టర్ రెడ్డీస్, నెస్లే ఇండియా, ఐటీసీ మాత్రమే నష్టపోయాయి.