తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా భయాలతో నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Stock markets distressed by corona fears
కరోనా భయాలతో నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

By

Published : Feb 17, 2020, 10:45 AM IST

Updated : Mar 1, 2020, 2:33 PM IST

కరోనా వైరస్​ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఖాయమన్న ఆందోళనల మధ్య స్టాక్​మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 33 పాయింట్ల నష్టంతో​ 41 వేల 225 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 12 పాయిట్లు తగ్గి 12,101 వద్ద కొనసాగుతోంది.

నష్టాల్లో...

ఎంఅండ్​ఎం, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్​ ఆటో, హెచ్​డీఎఫ్​సీ ఎల్​ అండ్​ టీ, సన్​ ఫార్మా, ఇండస్​ఇండ్​​ నష్టపోయాయి.

లాభాల్లో....

టీసీఎస్​, ఇన్ఫీ, ఎన్​టీపీసీ, నెస్లే ఇండియా, హిందూస్థాన్​ యూనిలివర్ లాభపడ్డాయి.

Last Updated : Mar 1, 2020, 2:33 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details