స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో 52,482 వద్ద స్థిరపడింది. ఆరంభంలో 335 పాయింట్లు పెరిగి 52,878 పాయింట్ల గరిష్ఠాన్ని తాకినా.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 15,721 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేయడం వరుసగా ఇది మూడో సెషన్.
బ్యాంకింగ్ రంగంలో ఒడుదొడుకుల కారణంగా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
లాభాల్లో ఇవే..
ఇన్ఫోసిస్, రిలయన్స్, టెక్‌మహీంద్ర, మారుతీ, టీసీఎస్, బజాబ్ ఆటో, భారతీ ఎయిర్టెల్.