లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగపరచుకునేందుకు బెంగళూరు- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. టీసీఎస్ అయాన్ విభాగం ద్వారా 15 రోజుల పాటు ఉచిత నైపుణ్య శిక్షణను అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కళాశాల విద్యార్థులు, ఉద్యోగార్థులు.. వారి నైపుణ్యాన్ని మెరుగుపరచుకొనేందుకు ప్రత్యేకంగా 'కెరీర్ ఎడ్జ్' పేరిట 'సెల్ఫ్-పేస్డ్ డిజిటల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్'ను రూపొందించింది.
'ఈ కార్యక్రమంలో అభ్యాసకులు నేర్చుకునేందుకు వీలుగా నానో వీడియోలు, కేస్ స్టడీస్ ఉంటాయి. నైపుణ్యం పరంగా వారి బలాలు- బలహీనతలను అంచనా వేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌ను మొబైల్‌ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ట్యాబ్‌ల వంటి పరికరాలలో యాక్సెస్ చేసుకోవచ్చు. తద్వారా మనకు అవసరమైన విధంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ కోర్సులు విద్యార్థులు, విద్యావేత్తలకు చక్కగా తోడ్పడతాయి.'