అనుమతుల ప్రక్రియ సహా వివిధ జాప్యాల కారణంగా కాండ్లా, ముంద్రా ఓడరేవుల్లో నిలిచిపోయిన స్టాక్ దిగుమతి అయితే దేశంలో వంటనూనెల ధరలు దిగివస్తాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే ఒక ప్రకటనలో తెలిపారు.
"రేవుల్లో నిలిచిపోయిన ఓడల సమస్యను కస్టమ్స్, భారత ఆహార భద్రతా ప్రమాణాల మండలి’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)తో కలిసి పరిష్కరించాం. అవి మార్కెట్లోకి విడుదలైతే వంటనూనెల ధరలు గణనీయంగా తగ్గుతాయి."
-సుధాన్షు పాండే, కేంద్ర ఆహార కార్యదర్శి
కరోనా సంక్షోభానికి తోడు.. గత కొన్నేళ్లుగా పెరిగిన వంటనూనెల ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంట నూనెల ధరల విధానాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే అన్నారు. వంటనూనెల కొరతను తీర్చేందుకు భారత్ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. ఏటా రూ.75,000 కోట్లు విలువైన నూనెలను దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు.
గత సంవత్సరంలో వనస్పతి, పామాయిల్, ఆవ నూనె, సోయాబీన్‌తో పాటు.. వేరుసెనగ నూనెల రిటైల్ ధరలు 37 నుంచి 55 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది మే 8న వనస్పతి రిటైల్ ధర 55.55 శాతం పెరిగి.. కిలో రూ.140కి చేరుకుంది.
ఇవీ చదవండి:దేశంలో మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
'నిధుల కేటాయింపుల్లో ఆరోగ్య రంగంపై నిర్లక్ష్యం'