తెలంగాణ

telangana

TTD Job Notification 2023 : తిరుమల తిరుపతి దేవస్థానంలో పర్మనెంట్​ ఉద్యోగాలు.. భారీగా వేతనాలు!

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 2:52 PM IST

TTD Job Notification 2023 : తిరుమల తిరుపతి దేవస్థానంలో శాశ్వతం ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే.. ఇది మీకోసమే! పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది టీటీడీ. మరి.. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూసేయండి.

TTD Job Notification 2023
TTD Job Notification 2023

TTD Job Notification 2023 :తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది టీటీడీ. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు కావు. పర్మనెంట్ నియమించే ఉద్యోగాలు. ఈ జాబ్స్​ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఎవరు అర్హులు..? (Who is Eligible For TTD Jobs) :

ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు.. ఈ ఉద్యోగాలకు అర్హులుగా నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. మరి, ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు..? ఉండాల్సిన విద్యార్హతలు ఏంటి..? ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి..? వంటి వివరాలను కూడా పేర్కొన్నారు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు..? (How Many TTD Jobs) :

తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్​లో మొత్తం 56 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు 27 ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు 10 ఉన్నాయి. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) పోస్టులు 19 ఉన్నాయి. అన్నీ కలిపి మొత్తం 56 పోస్టులకు టీటీడీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

How to Book TTD Special Darshan Tickets : తిరుమల స్పెషల్ దర్శనం టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలుసా..?

విద్యార్హతలు ఏంటి..? (Education Qualifications For TTD Jobs) :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి సంబంధించిన విద్యార్హతలను కూడా టీటీడీ స్పష్టం చేసింది. బీఈ, బీటెక్‌ (సివిల్‌/ మెకానికల్‌), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణులై ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతోపాటు వయసు కూడా మెన్షన్ చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలకు మించకూడదని స్పష్టం చేసింది.

ఎలా ఎంపిక చేస్తారు..? (Selection Process For TTD Jobs) :

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలను రెండు దశల్లో పూర్తి చేస్తారు. అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారిని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

వేతనం ఎంత చెల్లిస్తారు..? (How Much Salary Paid For TTD Jobs) :

ఇందులో ఉద్యోగానికి ఎంపికైన వారికి ఎంత వేతనం చెల్లిస్తారనే విషయాన్ని కూడా టీటీడీ నోటిఫికేషన్​లోనే వెల్లడించింది. ఏఈఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.57,100 నుంచి లక్షా 47,760 వరకు చెల్లిస్తారు. ఏఈ జాబ్​కు సెలక్ట్​ అయిన వారికి రూ.48,440 నుంచి లక్షా 37,220 వరకు ఇస్తారు. ఏటీవో పోస్టులకు ఎంపికైతే.. రూ.37,640 నుంచి లక్షా 15,500 వరకు వేతనంగా చెల్లిస్తారు.

TTD Alert : భక్తులకు అలర్ట్.. తిరుమల వెళ్తున్నారా? ఈ విషయం తెలియకుంటే ఇబ్బంది పడతారు!

ABOUT THE AUTHOR

...view details