ఓ నవవధువు తన భర్త సహా అతడి కుటుంబానికి స్నాక్స్‌లో మత్తుమందు కలిపి ఇచ్చింది. అనంతరం వారు స్పృహ కోల్పోగానే అక్కడ నుంచి పరారైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిందీ ఘటన. తనకు ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లే నవవధువు ఇలా చేసి ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
స్నాక్స్‌లో మత్తుమందు కలిపిన నవవధువు.. భర్త, అత్తమామలు స్పృహ తప్పాక పరార్!
పెళ్లై అత్తవారింటికి వెళ్లకముందే ఓ నవవధువు వారికి షాకిచ్చింది. రైలులో భర్త, అత్తమామలకు మత్తుమందు కలిపిన స్నాక్స్ ఇచ్చి.. వారు స్పృహ తప్పి పడిపోయాక అక్కడ నుంచి పరారైంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
ఇదీ జరిగింది..
రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు.. ఉత్తర్‌ప్రదేశ్ యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం నవవధువును తీసుకుని వారణాసి నుంచి జైపుర్ వెళ్తున్న మరుధర్ రైలులో స్వస్థలానికి బయలుదేరారు వరుడి కుటుంబ సభ్యులు. అప్పుడు నవవధువు తన భర్త, అత్తమామలకు మత్తుమందు కలిపిన స్నాక్స్‌ను ఇచ్చింది. వారు అవి తిని మత్తులోకి జారుకున్నారు. అలాగే వారిని రైలు నుంచి కిందకు దించి, నగ్లా రాంఫాల్ స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన వదిలేసింది. అనంతరం అక్కడి నుంచి పరారైంది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది బాధిత కుటుంబాన్ని ఆస్పత్రికి తరలించారు.