తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దొంగ పేరుతో వాట్సాప్​ గ్రూప్.. ఆ పోలీసుల నయా ట్రెండ్​!

WhatsApp group to nab a thief: దొంగతనానికి పాల్పడి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టుకునేందుకు కేరళ పోలీసులు సరికొత్త ఆలోచన చేశారు. దొంగ పేరు, ఫొటోతో వాట్సాప్​ గ్రూప్​ క్రియేట్​ చేశారు. కేరళ పోలీస్​ చరిత్రలోనే తొలిసారిగా పేర్కొన్నారు.

thief
వాట్సాప్​ గ్రూప్​

By

Published : Mar 19, 2022, 8:24 PM IST

Updated : Mar 19, 2022, 8:38 PM IST

WhatsApp group to nab a thief: దొంగలను పట్టుకునేందుకు పోలీసులు.. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని ఇట్టే పట్టేస్తున్నారు. కేరళలోని కాసరగొడ్​ జిల్లా పోలీసులు మరో మెట్టు ఎక్కి సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నారు. ఓ మహిళను కొట్టి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగుడిని పట్టుకునేందుకు అతని పేరుపై వాట్సాప్​ గ్రూప్​ క్రియేట్​ చేశారు. అందులో స్థానికులను చేర్చి.. దొంగ సమాచారాన్ని గ్రూప్​లో పోస్ట్​ చేయాలని సూచించారు.

నిందితుడు అశోకన్​

ఇదీ జరిగింది..

పది రోజుల క్రితం మడిక్కాయ్​ గ్రామానికి చెందిన ఓ మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు అశోకన్​ అనే వ్యక్తి. కేసు నమోదు చేసుకున్న హోస్దుర్గ్​ పోలీసులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వాట్సాప్​ గ్రూప్​ రూపొందించాలనే సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. దొంగ పేరు, ఫొటోతో గ్రూప్​ను క్రియేట్​ చేసి స్థానికులను అందులో చేర్చారు. ప్రస్తుతం ఈ గ్రూప్​లో 251 మంది సభ్యులు ఉన్నారు. పోలీసులతో పాటు గ్రామస్థులు అశోకన్​ కోసం గాలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని గ్రూప్​లో షేర్​ చేస్తున్నారు.

దొంగ పేరుతో వాట్సాప్​ గ్రూప్​

దొంగతనానికి పాల్పడిన అశోకన్​ సన్నిహితుడు మంజునాథన్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు. అయితే, అశోకన్​ తప్పించుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి దాక్కున్నాడు. సుమారు 400 ఎకరాల మేర అడవి విస్తరించటం వల్ల అందులోకి వెళ్లి వెతకటం సాధ్యం కాలేదని తెలిపారు పోలీసులు.

ఓ దొంగను పట్టుకునేందుకు వాట్సాప్​ గ్రూప్​ను రూపొందించటం కేరళ పోలీసు చరిత్రలోనే ఇదే తొలిసారిగా పేర్కొన్నారు అధికారులు.

దొంగ పేరుతో వాట్సాప్​ గ్రూప్​

ఇదీ చూడండి:రాళ్లు రువ్వుకుంటూ 'ఊరంతా' హోలీ.. 48 మందికి గాయాలు

Last Updated : Mar 19, 2022, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details