గతకొద్ది రోజులుగా బంగాల్ విభజనపై భాజపా, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు బంగాల్ను విభజనకు ఒప్పుకోనేది లేదని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర బంగాల్లోని జల్పాయ్గుడి జిల్లాకు చెందిన శంకర్ భట్టాచార్య అనే ఒక టీఎంసీ కార్యకర్త.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టారు. 750 కిలోమీటర్లు నడిచి.. కాళీఘాట్కు బుధవారం చేరుకున్నారు. తన వెంట తీసుకొచ్చిన మట్టిని ముఖ్యమంత్రి మమతకు ఇవ్వనున్నారు. బంగాల్ మట్టిని రెండుగా వేరు చేయొద్దని కోరనున్నారు. దీదీని కలిసిన అనంతరం జులై 21న జరిగే అమరవీరుల దివస్ సభకు ఆయన హాజరుకానున్నారు.
ఎవరీ శంకర్ భట్టాచార్య?.. జల్పాయ్గుడి జిల్లాలో దువార్ల ప్రాంతంలో శంకర్ భట్టాచార్య నివసిస్తున్నారు. కిరాణా దుకాణాన్ని నడుపుతూ జీవిస్తున్నారు. అయితే ఆయనకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవి లేకపోయినా.. ప్రతి ఎన్నికలో ఆ పార్టీకే మద్దతు పలుకుతారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చాలా గౌరవిస్తారు.