తెలంగాణ

telangana

రెండు డోసులు తీసుకున్న వారికి ఆ భయం లేదు!

By

Published : Jul 16, 2021, 9:53 PM IST

కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారిపై అధ్యయనం చేసింది ఐసీఎంఆర్. టీకా తీసుకున్నవారిపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

Icmr
ఐసీఎంఆర్

కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారిలో మరణాలు 95 శాతం తగ్గాయని ఐసీఎంఆర్ (ICMR) అధ్యయనంలో తేలింది. ప్రమాదకర డెల్టా వేరియంట్ వ్యాప్తిలోనూ.. కరోనా మరణాలు 95 శాతం తగ్గాయని వెల్లడించింది.

తమిళనాడులో సుమారు లక్షా 17 వేల 524 మంది పోలీసు సిబ్బందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 17 వేల మంది వ్యాక్సిన్‌కు దూరంగా ఉండగా.. 32 వేల 792 మంది ఒక డోసు 67 వేల 673 మంది రెండు డోసులు వేసుకున్నారు. వీరిలో టీకా తీసుకోని 20 మంది పోలీసులు మరణించగా.. ఒక డోసు తీసుకున్న వారు ఏడుగురు మరణించారు.

రెండు డోసులు తీసుకున్న పోలీసులు కేవలం నలుగురు మాత్రమే మరణించారని ఐసీఎంఆర్ నివేదిక తెలిపింది. మొదటి డోసు తీసుకున్న వారిలో టీకా ప్రభావం 82 శాతం ఉండగా రెండు డోసులు తీసుకున్న వారిలో 95 శాతం ఉందని సర్వే తెలిపింది. కరోనా మరణాలు నివారించడంలో టీకా రెండు డోసుల విధానం సమర్థంగా పనిచేసిందని వెల్లడించింది.

ఇదీ చదవండి:'ఆ వేరియంట్ వల్లే​.. టీకా తీసుకున్నా కరోనా'

ABOUT THE AUTHOR

...view details