Harish Rao on Chandrababu Arrest : చంద్రబాబు నాయుడు అరెస్టుపై మంత్రి హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు ( Chandrababu Arrest) చేయడం దురదృష్టకరమని తెలిపారు. ఈ వయసులో ఆయనను ఇలా చేయడం మంచిది కాదన్నారు. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదని ప్రతి పక్షాలు అనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు రైతుల గురించి ఆలోచించలేదని ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Harishrao Distributes Gruhalakshmi Documents : తిట్ల ప్రభుత్వం కావాలా?.. కిట్ల ప్రభుత్వం కావాలా?
Harish Rao Siddipet District Tour : నంగునూరు మండలం నర్మెట్టలో పర్యటించిన హరీశ్‌రావు పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ ప్రాంత రైతులకు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పరిశ్రమ ఎంతో దోహదం చేస్తుందని హరీశ్‌రావు తెలిపారు. ఆయిల్ పామ్ అంతర్ సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇందుకు సంబంధించి తగిన మెళకువలు నేర్చుకోవాలని సూచించారు. ఇతర దేశాల నుంచి.. భారతదేశం 60 శాతం పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నామని ఆయన వివరించారు.
పాలకులకు ముందు చూపు లేక పామాయిల్‌ను దిగుమతి చేసుకొనే దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని హరీశ్‌రావు అన్నారు. 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తే తప్ప దేశానికి సరిపోదని చెప్పారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం తో ముందుకు వెళ్తున్నామని వివరించారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Harish Rao Fires on Congress : 'బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి.. కాంగ్రెస్ చెబుతున్న అబద్దాలకు పోటీ'