తెలంగాణ

telangana

టీ అమ్ముతున్న ప్రపంచ ఛాంపియన్​

By

Published : Jun 14, 2021, 1:50 PM IST

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన హరిఓమ్​ శుక్లా.. కరాటేలో ఒకప్పటి ప్రపంచ ఛాంపియన్. ఎన్నో పోటీల్లో పాల్గొని అనేక పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ, ప్రస్తుతం బతుకుదెరువు కోసం రోడ్డు పక్కన టీ అమ్ముతున్నాడు. తనను ఆదుకోవాలని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ కనికరించేలేదని వాపోతున్నాడు.

world karate champion selling tea
కరాటే ఛాంపియన్​

టీ అమ్ముతున్న ప్రపంచ కరాటే ఛాంపియన్​

పేదరికం ఆ ప్రపంచ ఆటగాడిని రోడ్డు బాట పట్టించింది. ప్రత్యర్థిని తన పంచులతో ఎదుర్కొన్న ఆ చేతులిప్పుడు టీ కాయటంలో నిమగ్నమయ్యాయి. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక.. ప్రపంచ పతకాలు సాధించినప్పటికీ.. ఉత్తర్​ప్రదేశ్​ మథురకు చెందిన హరిఓమ్ శుక్ల అనే కరాటే ప్లేయర్​.. టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు.

టీ తయారు చేస్తున్న హరిఓమ్​ శుక్లా

ఇస్లాపుర్ గ్రామానికి చెందిన హరిఓమ్ శుక్లా.. 2013లో థాయ్​లాండ్​లో జరిగిన జూడో కరాటే ప్రపంచ ఛాంపియన్​షిప్​లో భారత్​ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆ పోటీలో విజేతగా నిలిచి భారత్​కు పతకం సాధించి పెట్టాడు. అంతకంటే ముందు కూడా వివిధ దేశాలతో పోటీల్లో పాల్గొన్న అతడు అనేక పతకాలను, ట్రోఫీలను గెలుచుకున్నాడు. అలాంటి ఛాంపియన్ ఇప్పుడు.. మథుర నగరంలోని ఓ అద్దె షాపులో, ప్రైవేట్​ ఆస్పత్రి వద్ద టీకాస్తున్నాడంటే.. ఎవరికైనా ఆశ్చర్యం, బాధ కలుగుతుంది.

2013లో హరిఓమ్​ శుక్లా సాధించిన ప్రపంచ కరాటే ఛాంపియన్​ పతకం
కరాటేలో తాను సాధించిన ట్రోఫీలతో హరిఓమ్ శుక్లా.

ఎవరూ పట్టించుకోలేదు..

జూడో కరాటే ఫెడరేషన్ ఆఫ్​ ఇండియా బ్యానర్​ కింద 2006 నుంచి కరాటే పోటీల్లో పాల్గొనటం ప్రారంభించిన హరిఓమ్​ శుక్లా... ఎన్నో పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. 2008లో ముంబయిలోని అంధేరి స్పోర్ట్స్​ కాంప్లెక్స్​లో జరిగిన పోటీలో పాల్గొని మొదటి అంతర్జాతీయ టైటిల్​ను కైవసం చేసుకున్నాడు.

"ఇప్పటివరకు దాదాపు 60 పతకాలను గెలిచాను. ఇన్ని పతకాలను, ఇన్ని ఘనతలను సాధించినప్పటకీ.. నాకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాలేదు. ఎన్నోసార్లు.. నన్ను ఆదుకోవాలని రాజకీయ నాయకులు, అధికారుల చుట్టూ తిరిగాను. అందరూ హామీలైతే ఇచ్చారు కానీ, ఎవరూ నెరవేర్చనే లేదు. పేద కుటుంబానికి చెందిన వాడిని కాబట్టి ఇలా టీ అమ్ముతూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను."

-హరిఓమ్ శుక్లా, కరాటే ప్లేయర్​

ఖేలో ఇండియా వంటి పథకాలను ఆటగాళ్లకు ప్రయోజనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినా.. క్షేత్రస్థాయుల్లో పరిస్థితులు వేరేలా ఉంటున్నాయని హరిఓమ్ శుక్లా ఘటన చెబుతోంది.

ఇదీ చూడండి:చదువులో రాణిస్తోంది.. ఆటల్లో మెరుస్తోంది.!

ఇదీ చూడండి:టోక్యో ఒలింపిక్స్‌పై ప్రధాని సమీక్ష

ABOUT THE AUTHOR

...view details