తెలంగాణ

telangana

'అతడి'తో సహజీవనం.. ఆస్పత్రి టాయిలెట్​లో ప్రసవం.. కమోడ్​లో నవజాత శిశువును పడేసి..

By

Published : Jun 23, 2023, 8:46 AM IST

Updated : Jun 23, 2023, 9:07 AM IST

Newborn Baby Found In Toilet : అప్పుడే పుట్టిన నవజాత శిశువును టాయిలెట్​ కమోడ్​లో పడేసి చంపేసింది ఓ మహిళ. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. దిల్లీలో ఈ ఘటన జరిగింది.

dead body of newborn was found in toilet
dead body of newborn was found in toilet

Newborn Baby Found In Toilet : ఓ మహిళ ఒక వ్యక్తితో సహజీవనం చేసి గర్భవతి అయింది. తమ బండారం బయటపడుతుందని.. నవజాత శిశువును ఆస్పత్రి టాయిలెట్​ కమోడ్​లో పడేసి చంపేసింది. అనంతరం అక్కడి నుంచి పరారయ్యింది. దిల్లీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దిల్లీలోని విజయ్​ విహార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో సీమ అనే మహిళ సందీప్​ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. అనంతరం ఆమె గర్భవతి అని తెలిసింది. చికిత్స కోసం జనవరి 20న రాత్రి 9.30 గంటలకు.. ఆమెను బుద్ధ విహార్​లోని రజినీ గుప్తా ఆస్పత్రికి తీసుకెళ్లారు నలుగురు వ్యక్తులు. ఇంతలో సీమకు పురిటి నొప్పులు మొదలవగా.. ఆస్పత్రి టాయిలెట్​లోనే బిడ్డను ప్రసవించింది. తన సహజీవనం బండారం బయటపడుతుందని భయపడిన సదరు మహిళ.. శిశువును టాయిలెట్​ కమోడ్​లో పడేసి చంపేసింది. అనంతరం అక్కడి నుంచి పరారయ్యింది.

చికిత్స చేయడానికి వచ్చిన డాక్టర్​ శ్రుతి.. గర్భిణీ గురించి ఆరాతీయగా.. ఆమె గదిలో లేదని.. టాయిలెట్​కు వెళ్లిందని ఆమెతో వచ్చినవారు తెలిపారు. అనంతరం కొంత సమయం తర్వాత గర్భణీ గదికి వెళ్లగా.. అందరూ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారని తెలిసింది. అయితే, అదే రోజు రాత్రి 12.30 గంటలకు ఓ వ్యక్తి టాయిలెట్​లో నవజాత శిశువు మృతదేహాన్ని చూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాక్షుల వాంగ్మూలం అధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ప్రాథమిక విచారణలో భాగంగా ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా.. నిందితుల గురించి వివరాలు తెలియలేదు. అనంతరం ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో దాదాపు 250 పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఓ మెడికల్​ షాపు వద్ద మందులు కొంటున్న నిందితుడు సందీప్​ను గుర్తించారు. ఆ తర్వాత మెడికల్​ షాపు యజమానిని విచారించగా.. పేటీఎమ్​లో నిందితుడు మందులు కొన్నాడని తెలిసింది. పేటీఎమ్​ ట్రాన్సాక్షన్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా.. సీమతో పాటుమరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

పదేళ్ల బాలికపై గ్యాంగ్​రేప్​..
దేశ రాజధాని దిల్లీలో పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు నిందితులు. వారికి ఓ మహిళ సాయం చేసినట్లు పోలీసులు చెప్పారు. గురువారం జరిగిన ఈ ఘటనలో నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పంజాబ్​కు చెందిన ఓ పదేళ్ల బాలిక తన తల్లితో కలిసి.. సన్​లైట్​ కాలనీలోని తన మేనమామ ఇంటికి వచ్చింది. గురువారం బాధితురాలి తల్లి బయటకు వెళ్లగా.. బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. పొరిగింట్లో నివాసముంటున్న ఓ మహిళ.. బాలిక తల్లి తన ఇంట్లో ఉందని బాధితురాలికి చెప్పింది. తనను పిలుస్తోందని బాలికను తన ఇంటికి పిలిచింది. అనంతరం బాలిక ఆ మహిళ ఇంటికి వెళ్లగా.. అప్పటికే అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఇంటికి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లి, మామకు చెప్పింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు సాహిబ్​ అలీ, విక్రమ్​ గౌతమ్​, అజ్జు పరారీలో ఉన్నారని తెలిపారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

Last Updated :Jun 23, 2023, 9:07 AM IST

ABOUT THE AUTHOR

...view details