దేశ సరిహద్దుల్లో మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు భద్రత దళాలకు కొత్త సవాళ్లు విసురుతున్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు(Venkaiah Naidu news) అన్నారు. అక్కడ డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కూడా తీవ్ర సమస్యను సృష్టిస్తున్నాయన్నారు. ఉగ్రవాదుల చొరబాట్లను, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్) సమర్థంగా అడ్డుకుంటోందని ఆయన ప్రశంసించారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా వెంకయ్యనాయుడు బుధవారం జోధ్‌పుర్‌లోని బీఎస్‌ఎఫ్ సరిహద్దు కేంద్ర కార్యాలయాన్ని, సందర్శించారు. అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడటంలో బీఎస్‌ఎఫ్ పాత్ర ఎనలేనిదన్నారు. పాకిస్థాన్‌తో పోరాడి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిందని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో గడ్డకట్టే శీతల వాతావరణంలోనూ, రాజస్థాన్‌లో 55 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ బీఎస్‌ఎఫ్ సిబ్బంది తమ బాధ్యతలను సమర్థంగానిర్వహిస్తున్నారని కొనియాడారు.
ఐసీఏఆర్ పరిశోధన కేంద్రం సందర్శన