తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీదీకి మరో కేబినెట్ మంత్రి షాక్​

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ నేతలే వరుస షాక్​లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడగా.. తాజాగా కేబినెట్​ మంత్రి పదవికి రాజీవ్ బెనర్జీ రాజీనామా చేశారు.

West Bengal Forest Minister Rajib Banerjee resigns from his office as Cabinet Minister
దీదీకి మరో కేబినెట్ మంత్రి షాక్​

By

Published : Jan 22, 2021, 1:06 PM IST

పశ్చిమ్​ బంగా​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే సువేందు అధికారి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరో కేబినెట్​ మంత్రి రాజీవ్​ బెనర్జీ కూడా పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మమతకు, గవర్నర్​కు పంపారు.

రాజీవ్​ బెనర్జీ బంగాల్​ అటవీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని, ఈ అవకాశం ఇచ్చినందుకు మమతకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'వచ్చే ఎన్నికల్లో టీఎంసీ తుడిచిపెట్టుకుపోతుంది'

ABOUT THE AUTHOR

...view details