తెలంగాణ

telangana

'అలా చేస్తేనే పైలట్​కు బంగారు భవిష్యత్'

By

Published : Jul 19, 2020, 3:09 PM IST

జ్యోతిరాదిత్య సింధియాలా సచిన్​ పైలట్ కూడా​ కాంగ్రెస్​ను వీడి భాజపాలోకి వెళ్లకూడదని సూచించారు సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్. పైలట్​కు కాంగ్రెస్​లో బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉందని తెలిపారు. రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభానికి భాజపాయే కారణమని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పారు దిగ్విజయ్.

Pilot shouldn't go Scindia way, has future in Cong: Digvijaya  By Manish Shrivastava
'సింధియా దారిలో పైలట్​ వెళ్లకూడదు'

సచిన్ పైలట్​కు కాంగ్రెస్​లో మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు ఆ పార్టీ సినీయర్ నేత దిగ్విజయ్​ సింగ్. జ్యోతిరాదిత్య సింధియాలా హస్తం పార్టీని వీడి భాజపాలో చేరకూడదని సూచించారు. ఇతర పార్టీల నుంచి ఆ పార్టీలోకి వెళ్లిన వారు ఎవరూ గుర్తింపు పొందిన దాఖలాలు లేవని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు దిగ్విజయ్​. రాజస్థాన్​లో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి భాజపాయే కారణమని విమర్శించారు.

"సచిన్​ పైలట్​ యువనేత. ఇంకా ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటారు. సీఎం అశోక్​ గహ్లోత్ కారణంగా మనస్తాపం చెంది ఉండొచ్చు. చర్చించుకుంటే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు.

26ఏళ్లకే పైలట్​కు ఎంపీ. 32ఏళ్లకే కేంద్రమంత్రి పదవి అవకాశం వరించింది. 34ఏళ్లకే పీసీసీ అధ్యక్షుడయ్యారు. 38ఏళ్లకే డిప్యూటీ సీఎం అయ్యారు. పార్టీ నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? భవిష్యత్తులో బ్రహ్మండమైన అవకాశాలున్నాయి. ఇతర పార్టీల నుంచి భాజపాలోకి వెళ్లిన నేతలెవరూ పైకి వచ్చిన దాఖలాలు లేవు. పైలట్​కు మూడు,నాలుగు సార్లు ఫోన్​ చేసినా, సందేశాలు పంపినా ఎలాంటి స్పందన లేదు. ఆయన నాకు కొడుకు లాంటి వారు. గతంలో ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే స్పందించేవారు. తన వర్గం 18మంది ఎమ్మెల్యేలపై పైలట్​కు నిజంగా విశ్వాసం ఉంటే హరియాణాలోని మనేసర్​ హోటల్​లో ఎందుకు ఉంచడం? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు భాజపా ఎమ్మెల్యేలు అదే హోటల్​లో మకాం వేశారు."

-దిగ్విజయ్​ సింగ్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

18 మంది ఎమ్మెల్యేలతో కలిసి అశోక్ గహ్లోత్​ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరేశారు సచిన్ పైలట్​. ఫలితంగా ఆయనను డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించింది కాంగ్రెస్. పైలట్​ వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు వేసింది.

ఇదీ చూడండి: 'కరోనా,జీడీపీ, చైనాపై భాజపా చెప్పేవన్నీ అబద్ధాలే'

ABOUT THE AUTHOR

...view details