తెలంగాణ

telangana

ప్రతి రోజూ పళ్లెంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా..

By

Published : Aug 31, 2020, 7:13 AM IST

Updated : Aug 31, 2020, 11:38 AM IST

కరోనా కాలంలో శరీరంలో తగినంత రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. శరీరం ఎంత దృఢంగా ఉంటే.. కొవిడ్​ లాంటి వ్యాధులను అంత సులువుగా జయించవచ్చు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలని భారత వైద్య పరిశోధన మండలి సూచిస్తూ.. సెప్టెంబర్​ను 'పౌష్టికాహార మాసోత్సవం'గా ప్రకటించింది. మరి ఏయే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉంటాయి, ఎంత శక్తినిస్తుందో ఓ సారి తెలుసుకుందాం..

ICMR ABOUT NUTRITIONAL FOOD
ప్రతిరోజూ పళ్లెంలో..

ఆకలిని తరిమేసి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ పళ్లెంలో మన చుట్టూ అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) పోషకాహార విభాగం ప్రజలకు సూచించింది. సెప్టెంబరు నెలను పౌష్టికాహార మాసోత్సవంగా జరుపుకోబోతున్న తరుణంలో.. 'ఈ రోజు నా పళ్లెంలో..' ('మై ప్లేట్‌ ఫర్‌ ది డే') పేరుతో ప్రజలు ఏ ఆహారాన్ని ఎంత మోతాదులతో తీసుకోవాలి, దానివల్ల రోజుకు ఎన్ని క్యాలరీల శక్తి వస్తుందన్న వివరాలు వెల్లడించింది. మనం తీసుకునే ఆహార పదార్థాలను మించిన పోషకాలను బయట లభించే విటమిన్‌, మినరల్‌ సప్లిమెంట్లు, ట్యాబ్లెట్లు, క్యాప్సూళ్లు, ఫోర్టిఫికేషన్‌లు ఇవ్వలేవని తెలిపింది. ఈ ఆహారం తింటే...

ఐసీఎంఆర్​ ప్రతిపాదించిన 'మై ప్లేట్​ ఫర్​ ది డే' చిత్రం
ఏయే ఆహార పదార్థాలు ఎంత శక్తినిస్తాయంటే..
  • రోగ నిరోధశక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్లను తట్టుకొనే సామర్థ్యం వృద్ధి చెందుతుంది.
  • మంచి మైక్రోబియల్‌ఫ్లోరా ఒకేస్థాయిలో ఉంటుంది. దీనివల్ల పేగుల్లోని మంచి బాక్టీరియాకు మేలు జరుగుతుంది.
  • తృణధాన్యాలతో మధుమేహం, హృద్రోగాలు తగ్గుతాయి.
  • క్షారతను తగిన మోతాదులో ఉంచి మంటను తగ్గిస్తుంది. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి.
  • ఇన్సులిన్‌ నిరోధకతను అరికట్టి, శరీరంలో తగినమోతాదులో ఇన్సులిన్‌ సున్నితత్వం, గ్లయిసెమిక్‌ ఉండేలా చూస్తుంది.
  • తగిన మోతాదులో పీచుపదార్థాలు తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది.
Last Updated :Aug 31, 2020, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details