ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతిధ్వని: పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో నాన్న పాత్రేంటి ?

By

Published : Jun 19, 2021, 9:01 PM IST

నాన్నంటే అడగకుండానే దేవుడు ఇచ్చిన జీవితకాల బహుమతి. బతుకంతా నీడనిచ్చే పెద్ద చెట్టు. బిడ్డల భవిష్యత్తుకు వెలుగులు అద్దడం కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోతాడు నాన్న. అమ్మఒడి ప్రేమలు పంచే గుడి అయితే... నాన్న భుజం ఈ ప్రపంచాన్ని కళ్లముందుకు తెచ్చే గుడి గోపురం. పిల్లల జీవితానికి బంగారు బాటలు పరిచే కార్యసాధకుడు నాన్న. బాధలన్నీ తన గుండెల్లోనే దాచుకుని ముఖంపై నవ్వులు పులుముకుంటాడు. భార్యాబిడ్డల మనసుల్లో నిరంతరం ధీమా నింపుతూ దీక్షగా ముందడుగేస్తాడు. అసలు నాన్నను అర్థం చేసుకునే అవకాశం ఎంత మంది పిల్లలకు వస్తుంది ? కన్నబిడ్డలపై ‌అపారమైన ప్రభావం చూపే తండ్రులందరికీ ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు చెబుతూ ఈటీవీ భారత్ ప్రత్యేక చర్చ చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details