ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీశైలం మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవం

By

Published : Nov 9, 2021, 11:01 AM IST

శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ పుష్కరిణి కార్తిక దీప కాంతులతో వెలుగులో నవ్య శోభను సంతరించుకుంది. స్వామి, అమ్మ వార్లకు దశ విధ హారతుల కార్యక్రమం నేత్రశోభితంగా సాగింది. కార్తిక తొలి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలోని ఆలయ పుష్కరిణిని రంగు రంగుల విద్యుత్ కాంతులతో అలంకరించారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవమూర్తులను వేదికపై కొలువుదీర్చారు. స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణలతో స్వామి అమ్మవార్లకు దశ విధ హారతులు సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా లక్ష దీపోత్సవం జరిగింది. భక్తులు లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్తిక దీపాలు వెలిగించారు.

ABOUT THE AUTHOR

...view details