ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE VIDEO : మూతికి నిప్పు.. అలరించబోయి విలపించాడు..!

By

Published : Nov 10, 2021, 10:45 AM IST

Updated : Nov 10, 2021, 10:58 AM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీని పాత వీధిలో నాగుల చవితి సందర్భంగా నిర్వహించిన "నేల వేషాలు" కార్యక్రమంలో సంతోష్ అనే వ్యక్తి అగ్ని ప్రమాదానికి గరయ్యాడు. నోట్లో డీజిల్ పోసుకుని ఫైర్ చేస్తుండగా.. పొరపాటున రివర్స్ ఫైర్ అయ్యింది. దీంతో.. నోటికే నిప్పు అంటుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్​ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలమంచిలి పట్టణంలోని ఉత్సవాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ సంఘటన.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అయితే.. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదు.
Last Updated : Nov 10, 2021, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details