ఆంధ్రప్రదేశ్

andhra pradesh

“గెలుపు మనదే” 2024 డైరీనీ ఆవిష్కరించిన చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 7:10 AM IST

ysrcp_leaders_joined_in_presence_of_tdp

YSRCP leaders joined in presence of TDP: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సార్​సీపీ నేతలు, కార్యకర్తలు పసుపు కండువా కప్పుకున్నారు. కదిరి నుంచి వైఎస్సార్​సీపీకి చెందిన రెండు వందల కుటుంబాలు, ఏలూరు నుంచి మాజీ మంత్రి మరడాని రంగారావు, ఆటో యూనియన్ లీడర్‌ లీలా కృష్ణ, వంద మందికి పైగా అనుచరులు టీడీపీలో చేరారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వ విధానాలతో తాము నష్టపోయామని ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు తెలిపారు. కదిరిలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, పులివెందులలో కూడా తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని వెల్లడించారు.

స్వేచ్చగా ఓటింగ్ జరిగితే పులివెందులలో కూడా జగన్​కు ఓటమి తప్పదని పేర్కొన్నారు. పోలీసుల చలానాలు, పన్నులు, పెట్రోల్ ధరలతో తాము ఎంతో నష్టపోతున్నామని ఆటో యూనియన్ నేతలు చంద్రబాబుకు వివరించారు. తెలుగుదేశం యువ నాయకుడు వల్లూరు కిరణ్ రూపొందించిన “గెలుపు మనదే” 2024 నూతన సంవత్సరం డైరీనీ చంద్రబాబు ఆవిష్కరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని వల్లూరు కిరణ్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details