ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP MLA Kethireddy: 'వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు.. తీవ్రవాదుల్లా పని చేయాాలి'

By

Published : May 17, 2023, 2:19 PM IST

వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి

YCP MLA Kethireddy Comments: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్రవాదుల్లా పని చేయాలని.. ఆ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని మారుతి రాఘవేంద్ర కల్యామండపంలో.. నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేతిరెడ్డి.. వైసీపీ కార్యకర్తలు కరుడుగట్టిన తీవ్రవాదుల్లా పని చేస్తున్నారని, ఇంకా గట్టిగా పని చేయాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీల లోపాలను గుర్తించి సోషల్ మీడియాలో గట్టిగా.. ప్రచారం చేయాలని సూచించారు. మరింత గట్టిగా పని చేస్తూ.. ప్రతిపక్షాలను ఎండగట్టాలని కేతిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను తీవ్రవాదులతో పోల్చుతూ మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా.. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్‌ చేసే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తమను మోసం చేశారని ఇటీవల తుంపర్తి, మోటుమర్ల రైతులు వాపోయారు. ఎన్నికల్లో ప్రచారానికి వాడుకొని.. గెలిచాక ఇచ్చిన మాట గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details