ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP Leaders Land Grabs: పార్టీ కోసం పదవిని త్యాగం చేస్తే భూకబ్జాలకు పాల్పడుతున్నారు.. ఎమ్మెల్యే ఎదుట వైసీపీ నేత ఆవేదన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 3:21 PM IST

ycp_leaders_land_grabs

YCP Leaders Land Grabs in Nandyala YS Nagar:వార్డు అభివృద్ధి చేయాల్సిన కౌన్సిలర్ భర్త భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి అదే పార్టీకి చెందిన నాయకుడు పుల్లయ్య వివరించారు. నంద్యాల వైఎస్​ నగర్​లో కమ్యూనిటీ హాల్, ఆలయం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కౌన్సిలర్ భర్త కబ్జా చేసి ప్లాట్లు వేస్తున్నట్లు ఆరోపించారు. కబ్జా విషయంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎదుటే కౌన్సిలర్ భర్త రమణ, వైసీపీ నాయకుడు పుల్లయ్యలకు వాగ్వాదం జరిగింది. కౌన్సిలర్ పదవి బరిలో ఉన్న నన్ను తప్పించిన మీరు, మీ తండ్రి ఎలాంటి న్యాయం చేయలేదని వాపోయారు. నంద్యాల 38వ వార్డు వైఎస్​ నగర్​లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నాయకుడు పుల్లయ్యను కలిసేందంకు ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లగా సమస్యను వివరించారు. ఈ సందర్భంగా పుల్లయ్య ఆలయ భూముల గురించి ఎమ్మెల్యేకు విరించారు.

ABOUT THE AUTHOR

...view details