ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP leaders Attacks on janasena leader : జనసేన కార్యకర్తపై వైసీపీ కార్యకర్తల దాడి

By

Published : Aug 12, 2023, 2:14 PM IST

జనసేన కార్యకర్తపై వైసీపీ కార్యకర్తల దాడి

YCP leaders Attacks on janasena leader: వైసీపీ నాయకుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట ఉన్న దాడుల సంస్కృతి నేడు రాష్ట్రం నలుమూలలకు విస్తరిస్తోంది. తాజాగా అదోనిలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కర్నూలు జిల్లా అదోనిలో జనసేన కార్యకర్త పై వైసీపీ కార్యకర్తలు దాడి పాల్పడ్డారు. భోళాశంకర్‌ సినిమా ప్రదర్శిస్తున్న హాలు వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో 25 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్త ఇంటికి వెళ్లి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో జనసేన కార్యకర్త ప్రభుకు తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలంలో ఎస్సీ మహిళపై  ముగ్గురు వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటన లో పోలీసులు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details