ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీ సామాజిక బస్సు యాత్రలో అపశృతి - ఆకలిని తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయిన మహిళ, ప్రసాదం కోసం జనాలు బారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 1:06 PM IST

YCP_Bus_Yatra_in_Sri_Sathya_Sai_District

YCP Bus Yatra in Sri Sathya Sai District :  శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభంలోనే ప్రజలు వెనుదిరగడంతో బహిరంగ సభ బోసిపోయింది. బస్సు యాత్ర ప్రారంభించి, మధ్యాహ్నానికి వైఎస్సార్ కూడలికి చేరుకుని సభ మెుదలు పెట్టారు. అప్పటికే భోజన సమయం అవ్వడంతో పలువురు సభ ప్రారంభంలోనే వెనుదిరిగారు. ఎండ తీవ్రతతో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు వెంటనే ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరికొందరు ఆకలి తట్టుకోలేక పక్కనే ఉన్న సాయిబాబ ఆలయంలో ప్రసాదం కోసం బారులు తీరారు.

వైసీపీ నాయకులు బస్సు యాత్రకు ముందు ప్రజల అభిప్రాయలు సేకరించారు. గతంలో ఇంటి పన్ను రూ.100 ఉండగా ప్రస్తుతం రూ.1000 అయిందని ప్రజలు మండిపడ్డారు. అలాగే పట్టణంలో పారిశుధ్య లోపంతో దోమలు విపరీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర, బహిరంగ సమావేశానికి పలువులు రాజకీయ నేతలు హాజరయ్యారు. వారిలో మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీలు మాధవ్, నందిగామ సురేష్, మాజీ మంత్రి శంకర్ నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎమ్మెల్సీ మంగమ్మ, జడ్పీ ఛైర్మన్ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details