ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP Activist Fire on Minister Appalaraju: 'మంత్రి అప్పరాజుకు ఓటేసి తప్పుచేశా'.. చెప్పుతో కొట్టుకున్న వైసీపీ కార్యకర్త

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2023, 1:19 PM IST

YCP_Activist_Fire_on_Minister_Appalaraju

YCP Activist Fire on Minister Appalaraju: ఎన్నికల్లో మంత్రి సీదిరి అప్పలరాజు గెలుపుకోసం ప్రచారం నిర్వహిస్తే.. ప్రస్తుతం తనపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం అల్లుఖోల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త గేదెల బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిదిరి అప్పలరాజుకి  ఓటేయడం ఘోర తప్పిదమంటూ చెప్పుతో కొట్టుకున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయడంతో.. టీడీపీ శ్రేణులతో కలిసి గౌతు శివాజీ, గౌతు శిరీష పలాసలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు గౌతు శివాజీ, శిరీషలను బలవంతంగా అదుపులోకి తీసుకుని సోంపేట తరలించగా.. వారికి బాబూరావు మద్దతు తెలిపారు. వాళ్లకు మద్దతుగా పోలీస్ స్టేషన్​కు వచ్చిన బాబూరావు.. అక్కడే చెప్పుతో కొట్టుకుని అప్పలరాజు వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

"మంత్రి సీదిరి అప్పలరాజుకు 2019 ఎన్నికల్లో ఓటేయడమే కాకుండా ఆయన తరఫున ప్రచారం చేసి తప్పు చేశాను. ఆయనకు ఓటేయడం ఘోర తప్పిదం. పార్టీ కోసం కష్టపడిన నాపై అక్రమ కేసులు పెట్టారు."- గేదెల బాబూరావు, వైసీపీ కార్యకర్త 

ABOUT THE AUTHOR

...view details