ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబు నివాసంలో ముగిసిన ప్రత్యేక పూజలు - మూడు రోజులుగా హోమం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2023, 3:20 PM IST

pujas_at_chandrababu_house

Yagam and Pujas at Chandrababu House:రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో గత మూడు రోజులుగా యాగాలు, పూజలు (Chandrababu performing yagam) నిర్వహించారు. నేటితో ప్రత్యేక హోమం, పూజలు ముగిశాయి. మూడు రోజులుగా చంద్రబాబు దంపతులు శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా చేశారు. యాగం, హోమం, పూజ కార్యక్రమాల్లో  కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. 

3 రోజుల పాటు జరిగిన ఈ పూజలలో మొదటి రోజు యాగ క్రతువులో భాగంగా శుక్రవారం యజ్ఞాలు చేశారు. గుంటూరుకు చెందిన వేద పండితుల ఆధ్వర్యంలో 40 మంది రుత్వికులు, చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో పూజలు చేయించారు. రాష్ట్రం సురక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు. రెండవ రోజు శనివారం కూడా యాగం కొనసాగింది.  

ABOUT THE AUTHOR

...view details