ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Woman Suicide Attempt in Front of Police Station : భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్ ఎదుట భార్య ఆత్మహత్యాయత్నం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2023, 1:08 PM IST

Woman_ Suicide_ Attempt_ in_ Front_ of Police_ Station

Woman Suicide Attempt in Front of Police Station: తన భర్త ఆచూకీ తెలపాలంటూ నంద్యాల జిల్లా డోన్ పోలీస్ స్టేషన్ ఎదుట భూలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యకు యత్నించింది. డోన్ పట్టంలోని శ్రీరామనగర్ కు చెందిన ఎరుకల మురళిని గత ఐదు నెలల కిందట గంజాయి అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు.. గత శుక్రవారం ఉదయం బెయిల్ పై విడుదలయ్యాడు. వెంటనే పట్టణ పోలీసులు విచారించి పంపుతామని మురళిని అదుపులోకి తీసుకున్నారు. గత రెండు రోజులుగా మురళి గురించి ఆచూకీ తెలపకపోవడంతో భార్య భూలక్ష్మి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. ఆందోళన చేపట్టిన భూలక్ష్మి వద్దకు పోలీసులు వచ్చి.. మీ భర్త పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి, కడప జైలుకి తరలించామని చెప్పారు. పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చున్న ఆమె నిద్ర మాత్రలు మింగింది. కొద్దిసేపటికి ఆమె స్పృహ కోల్పోవడంతో పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ మేరకు మురళి పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అతడిపై 11 కేసులు ఉన్నందున పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి కడప సెంట్రల్​ జైలుకు తరలించామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details