ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని హెచ్చరిక- ఇకపై ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు ఉండవా?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 9:34 AM IST

Warning_to_AP_Govt_over_Arogyasri_Services

Warning to AP Govt  over Arogyasri Services: డిసెంబర్‌ 29 నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఫీజుల చెల్లింపుల్లో జాప్యాన్నీ, ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడం లేదని వివరించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద కూడా సేవలు అందించలేమని పేర్కొంది. 

Hospitals to Stop Aarogyasri Services: డిమాండ్లను పరిష్కరిస్తామని గతనెలలో ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రైవేటు ఆస్పత్రులు సేవలు కొనసాగించాయనీ ఇప్పుడు సానుకూల చర్యలు లేనందున వైద్య సేవలు నిలిపేయాలని నిర్ణయించామని తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల దాకా చెల్లించాల్సి ఉంది. నవంబరులో జరిగిన చర్చల సందర్భంగా డిసెంబరు నెలాఖరులోగా పూర్తిస్థాయిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు కాలేదు. అలాగే 2013 నుంచి చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచకపోవడంపై ప్రైవేటు ఆస్పత్రులు అసంతృప్తితో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details