ఆంధ్రప్రదేశ్

andhra pradesh

VRAs Chalo Vijayawada: ఉద్రిక్తతకు దారి తీసిన వీఆర్​ఏల 'చలో విజయవాడ'.. ఎక్కడికక్కడ అరెస్టులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2023, 2:27 PM IST

vras_chalo_vijayawada

VRAs Chalo Vijayawada and Arrest: సమస్యలు పరిష్కరించాలంటూ వీఆర్​ఏల తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకు అనుమతి లేదన్న పోలీసులు.. ధర్నాచౌక్‌ మార్గంలో ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడ వారిని అక్కడే అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేసి అరెస్ట్ చేసి పోలీసుల స్టేషన్​కు తరలించారు. ఉదయం 8 గంటల నుంచే భారీగా మోహరించి వీఆర్ఏలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విజయవాడకు వీఆర్ఏలు చేరుకున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వీఆర్ఏ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తమకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచారని వీఆర్ఏలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలు పెంచి.. పేస్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారం చేయమని శాంతియుతంగా చేపట్టిన నిరసనలో అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపట్నుంచి అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details