ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vinukonda Issue: వినుకొండ ఘటన.. 200మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు

By

Published : Jul 28, 2023, 7:07 PM IST

టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు

Police Case Against TDP Leaders: పల్నాడు జిల్లా వినుకొండలో తెలుగుదేశం-వైసీపీ మధ్య జరగిన ఘర్షణలో దాదాపు 200 మంది తెలుగుదేశం కార్యకర్తలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారుపై దాడి చేయడం సహా.. డోరు తెరిచి ఆయనపై దాడి చేయబోయారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినుకొండ పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. గురువారం పల్నాడు జిల్లా వినుకొండను రణరంగంగా మార్చింది. ఓపక్క అధికార పార్టీ కార్యకర్తలు, మరోవైపు ప్రతిపక్ష శ్రేణులు.. పెద్ద ఎత్తున మోహరించి గొడవ పడటంతో స్థానిక ఆర్టీసీ బస్టాండు ప్రాంతంలో రెండు గంటలపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపే వరకు వెళ్లడం పరిస్థితి తీవ్రతను చాటి చెబుతోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ మొత్తం గొడవకు కేంద్ర బిందువుగా మారారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణుల ర్యాలీలోకి చొచ్చుకొచ్చిన ఎమ్మెల్యే.. ఆయన వాహనాలకు దారి ఇచ్చినా వెళ్లకుండా ఘటనాస్థలిలోనే ఉండి ప్రతిపక్ష కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఈ ఘర్షణలో అయిదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గొడవను నివారించడంలో ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులు.. చివరకు టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టడానికే పరిమితం కావడం విమర్శలకు దారి తీసింది.

ABOUT THE AUTHOR

...view details