ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MP Kesineni Nani on TDP Chief Chandrababu Naidu దేశంలో నిజాయతీ ఉన్న కొద్దిమంది నేతల్లో చంద్రబాబు ఒకరు: ఎంపీ కేశినేని

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2023, 4:21 PM IST

Updated : Sep 8, 2023, 5:36 PM IST

MP_Keshineni_Nani_on_TDP_Chief_Chandrababu

Vijayawada MP Kesineni Nani on TDP Chief Chandrababu Naidu తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఐటీ శాఖ నోటీసులు ఇవ్వటంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు నాయుడు అవినీతి లేని నాయకుడని ఎంపీ కేశినేని నాని అన్నారు. దేశంలో అతికొద్ది మంది నిజాయితీ గల రాజకీయ నాయకుల్లో చంద్రబాబు ఒకరని కొనియాడారు. చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు ఇవ్వటం చాలా సాధారణ విషయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నిక్లల్లో తాను తెలుగుదేశం పార్టీ తరుఫున ముచ్చటగా మూడోసారి పార్లమెంట్‌లో అడుగు పెడతానని నాని ధీమా వ్యక్తం చేశారు.

MP Kesineni Nani Comments:ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో శుక్రవారం ఓ ప్రైవేట్ స్కూల్ భవన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌లు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. ''తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నుంచే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాను. ముచ్చటగా మూడోసారి తప్పనిసరిగా పార్లమెంట్‌లో ఎంపీగా అడుగు పెడతాను. చంద్రబాబు నాయుడు తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడ అవినీతి అనే మచ్చలేకుండా ప్రజలకు సేవ చేశారు. ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పటికే కృషి చేస్తూనే ఉన్నారు.'' అని నాని అన్నారు.  

Last Updated : Sep 8, 2023, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details